Recent Posts

‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్‌’ నిబంధనల్లో మార్పులు

అమరావతి: నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల కోసం ప్రవేశ పెట్టిన ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్‌’లో రూల్స్ మారాయి..ఈ స్కీమ్ కింద పొందే రూ.6 వేలు ఇక నుంచి ఖచ్చితంగా పొలం ఎవరి పేరు మీద ఉంటుందో వారి బ్యాంకు అంకౌంట్ కే నగదు బదిలీ జరుగుతుంది..ఈ స్కీమ్‌లో కొత్తగా చేరే వారికి ఈ రూల్ వర్తిస్తుంది..ఈ పథకంలో రైతులకు ఏడాదికి రూ.6వేలు రూపాయలు మూడు విడతల్లో రూ.2వేల చొప్పున రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది..పొలం తల్లిదండ్రుల పేరు మీద ఉండి మీరు వ్యవసాయ పనులు చేస్తున్నారంటే కూడా కుదరదు..పొలాన్ని తమ పేరు మీదకి మార్చుకుంటే ఆ డబ్బు వస్తుంది..అలాగే పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నా కూడా పీఎం కిసాన్ యోజన నదగు బదలీ కాదు..వీటితో పాటు ఇంట్లో ఎవరైనా నెలకు రూ.10వేలకు పైగా పెన్షన్ తీసుకుంటున్నా,,రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నట్లయితే పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు పొందడం వీలు కాదు..పై నిబంధనలు స్పష్టంగా వుంటే,,మీరు పెట్టుకున్న అప్లికేషన్‌ని రాష్ట్ర ప్రభుత్వం ఓకే చేస్తేనే కేంద్రం నుంచి నగదు బదలీ అవుంతుంది..

Spread the love