Recent Posts

రేపు రాష్ట్ర బంద్ కు చంద్రబాబు పిలుపు

అమరావతి: తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడులకు నిరసనగా బుధవారం రాష్ట్ర బంద్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బంద్‌కు పిలుపు నిచ్చారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని మండిపడ్డారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు..ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను ఉద్దేశించి పట్టాభి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుకు విశాఖ నర్సీపట్నం పోలీసుల నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వంపై పట్టాభి చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణం అయ్యాయి.టీడీపీ, వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఆవేశాలకు గురికావొద్దని, అందరూ సంయమనం పాటించాలని ఏపీ డీజీపీ కార్యాలయం కోరింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

Spread the love
error: Content is protected !!