AMARAVATHI

డీజీపీగా బాధ్యతలు చేపట్టిన Ch.ద్వారకా తిరుమలరావు

అమరావతి: రాష్ట్ర నూతన డీజీపీగా Ch.ద్వారకా తిరుమలరావు శుక్రవారం ఉదయం 7:50 గంటలకు డీజీపీ హోదాలో బాధ్యతలు చేపట్టారు.. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన హరీశ్​​కుమార్‌ గుప్తా నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు.. 1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారుల సీనియారిటీ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు.. మొట్ట మొదటిగా కర్నూలు ఏఎస్పీగా పోస్టింగ్‌ చేపట్టారు..ఆటు తరువాత ఆయన కామారెడ్డి, ధర్మవరం,, నిజామాబాద్‌లో బాధ్యతలు నిర్వర్తించారు.. ఎస్పీగా పదోన్నతి పొంది తరువాత అనంతపురం, కడప, మెదక్‌ జిల్లాలతో పాటు విజయవాడ రైల్వే, సీఐడీ, సీబీఐ విభాగాల్లో విధులు నిర్వహించారు.. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా పనిచేశారు.. 2021 జూన్‌ నుంచి APSRTC MDగా ఉన్నారు.. తిరుమలరావుకు నిక్కచ్చిగా వ్యవహరించే సమర్థవంతమైన అధికారిగా పోలీసు శాఖలో గుర్తింపు ఉంది..ఈ సందర్భంగా పలువురు ఐపీఎస్ అధికారులకు ద్వారకా తిరుమలరావుకు శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *