Recent Posts

భారత్ లోనే 6 లక్షల AK-203 అసాల్ట్‌ రైఫిల్స్ తయారీకి కేంద్రం ఆమోదం

అమరావతి: ఇప్పటి వరకు భారత్ మిలటరీకి కావల్సిన ఆయుధలను ఇతర దేశాలపైన ఆధారపడుతు వస్తుంది..ప్రస్తుతం ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా 6 లక్షల AK-203 అసాల్ట్‌ రైఫిల్స్ తయారీకి కేంద్రం ఆమోద తెలిపింది..దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులకు తోడు రక్షణ పరికరాల తయారీ రంగంలో స్వావలంబన సాధించడంలో భాగంగా ఈ అసాల్ట్‌ రైఫిల్స్ తయారీకి కేంద్రం ముందడుగు వేసింది..రష్యా సాంకేతిక సాకారంతో ఉత్తరప్రదేశ్‌ అమేథీ సమీపంలో వున్న కోర్వా యూనిట్‌లో వీటిని తయారుచేయనున్నారు.. ప్రస్తుతం కేంద్ర సాయుధ బలగాలు ఇన్సాన్ (INSAS) గన్స్ ను వాడుతున్నాయి.. వీటి స్థానంలో 7.62 X 39 mm క్యాలిబర్‌ AK-203ను అందించాలని నిర్ణయించింది..ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన  AK–47 గన్స్‌ కు అప్ గ్రేడే ఈ AK–203 రైఫిల్స్‌..రూ.5,100 కోట్ల రూపాయల విలువ చేసే ఇండో- రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (IRRPL) జాయింట్‌ వెంచర్‌ ప్రాజెక్టులో భాగంగా రష్యాకు చెందిన కలాష్నికోవ్‌ అనే సంస్థ వీటి తయారీకి కావాల్సిన సాంకేతిక సహకారం అందిస్తుంది.రైఫిల్స్‌ తయారీకి అవసరమైన కావాల్సిన ముడి పదార్థాల తయారీ కోసం రక్షణరంగంలో దేశంలో వున్న వివిధ మధ్య తరగతి,చిన్న తరహా పరిశ్రమలకు ఆర్డర్స్ పెరుగుతాయి.. దింతో ఆయా పరిశ్రమల్లో యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగైతాయి..చైనా,,పాకిస్తాన్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ పొడవునా ఉగ్రవాద, తిరుగుబాటు దాడులను నిలువరించేందుకు వీలుగా మన ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు అవకాశం కలుగుతుంది’ అని రక్షణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు..

Spread the love
error: Content is protected !!