Recent Posts

చైల్డ్ పోర్న్ వీడియోలను ఆప్ లోడ్ చేస్తున్న రాకెట్ పై సిబిఐ దాడులు

14 రాష్ట్రాల్లోని 76 ప్రాంతాల్లో..

అమరావతి: వెబ్ సైట్స్ ద్వారా చైల్డ్ పోర్న్ వీడియోలను ఆప్ లోడ్ చేసే మాఫియాపై దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని 76 ప్రాంతాల్లో ఏకకాలంలో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది..చైల్డ్ పోర్న్ వీడియోలను సర్క్యులేట్ చేస్తున్న 83 మంది అనుమానితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..ఆంధ్రప్రదేశ్‌ తోపాటు ఢిల్లీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఒడిశా, త‌మిళ‌నాడు, రాజ‌స్థాన్‌, పంజాబ్, బీహార్, మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్, హ‌ర్యానా, ఛ‌త్తీస్‌గ‌ఢ్, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో త‌నిఖీలు కొన‌సాగుతున్నాయి.. ఈ దాడుల్లో కొన్ని వీడియోలు సీబీఐ అధికారుల కంటపడటంతో వాటిని సీజ్ చేశారు..చైల్డ్ పోర్న్ వీడియోలు చూసినా, సర్క్యులేట్ చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రం పలు సార్లు హెచ్చరించింది..కేంద్రం హెచ్చరికలను పట్టించుకోకుండా,,ఆక్రమ మార్గల్లో డబ్బు సంపాదించడమే లక్ష్యంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు..ఈ నెల 14వ తేదిన 23 కేసులు నమోదు కావడంను చూస్తే,ఎంత విచ్చలవిడిగా చైల్డ్ పోర్న్ రాకెట్ నడుస్తుందో అర్ధం చేసుకోవచ్చు..ప్రస్తుతం అరెస్ట్ అయిన 83 మందికి ఎలాంటి శిక్షలు పడుతాయో అనేది వేచి చూడాలి..

Spread the love
error: Content is protected !!