July 4, 2022

హైదరాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై సిబిఐ దాడులు

హైదరాబాద్: దేశరాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ IPL మ్యాచ్ ఫిక్సింగ్,,పాకిస్తాన్ తో సంబంధం వున్న క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ ను సిబిఐ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు..ఈ కేసుకు సంబంధించి పెద్ద తలకాయలు వుండడంతో,,ఢిల్లీ సీబీఐ విభాగం దర్యాప్తు చేపట్టింది..హైదరాబాద్ కు చెందిన ఇద్దరు పంటర్ల పేర్లను FIRలో చేర్చిన అధికారులు,, హైదరాబాద్ నగరంలో 4 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు..ఇందులో ఎల్బీనగర్ SBI కాలనీకి చెందిన గుర్రం సతీష్,, గుర్రం వాసు ఇళ్లు,,వ్యాపారల కార్యలయల్లో సోదాలు చేశారు..అనుమానస్పదంగా వున్న పలు అకౌంట్లకు 10 కోట్ల డబ్బు మారినట్లు గుర్తించిన  అధికారులు,,వారి ఖాతాలను ఫ్రీజ్ చేశారు… ఢిల్లీకి చెందిన బిగ్ ఫిష్…దిలీప్ కుమార్ అరెస్టుతో ఈ క్రికెట్ బెట్టింగ్ డొంక కదిలినట్లు సమాచారం..పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తోన్న బెట్టింగ్ మాఫియా హైదరాబాద్‌లో ఉన్న కొందరితో కలిసి ఢిల్లీ మాఫియాతో బెట్టింగ్ నెట్టింగ్ ఏర్పాటు చేసినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. హైదరాబాద్‌కు చెందిన గుర్రం సతీష్, వాసు కీలక పాత్ర పోషించినట్లుగా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.. నకిలీ ఖాతాలను తెరిచి పెద్ద మొత్తంలో లావాదేవీలను నిర్వహిస్తున్నట్లు గుర్తించింది. హైదరాబాద్, ఢిల్లీలో సీబీఐ ఏకకాలంలో సోదాలు చేసింది. సతీష్, వాసులకు చెందిన ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లుగా తెలుస్తోంది.2010 నుంచి ఈ ముఠా నెట్ వర్క్ ను నడుపుతుంది..పాక్ బెట్టింగ్ గ్యాంగ్,,వాకస్ మాలిక్ లతో లింక్స్ ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు..

 

Share
error: Content is protected !!