Recent Posts

జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై విచారణ ఈనెల 26కు వాయిదా వేసిన సిబిఐ కోర్టు

హైదరాబాద్: ఏ.పి సీ.ఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్‌పై విచారణను సీబీఐ న్యాయస్థానం ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.. 26వ తేదీ నాటి విచారణ సమయానికి తప్పనిసరిగా కౌంటర్‌ను దాఖలు చేయాలని న్యాయస్థానం వైఎస్ జగన్‌ను ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయడానికి మరో అవకాశం ఉండకపోవచ్చని వ్యాఖ్యానించింది..అధికార వైసీపీ నరసాపురం ఎం.పి కే.రఘురామ కృష్ణంరాజు సీబీఐ న్యాయస్థానంలో వైఎస్ జగన్‌కు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసి,,ఆయనపై నమోదైన ఆస్తుల కేసు విచారణను వేగవంతం చేయాలంటూ ఇదివరకే పిటీషన్ వేశారు..దీన్ని విచారణకు స్వీకరించిన సీబీఐ న్యాయస్థానం..కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ అధికారులు, వైఎస్ జగన్ తరఫు న్యాయవాదిని ఆదేశించింది..రెండు పక్షాలు కూడా కౌంటర్‌ను దాఖలు చేయలేదు..దానితో విచారణ వాయిదా పడుతూ వచ్చింది..తాజా విచారణ సందర్భంలోనూ కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని ఇరు పక్షాల తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు..ఈ సారి కూడా కౌంటర్ దాఖలు చేయకపోవడంతో సీబీఐ న్యాయస్థానం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తు ఇలా ఎంతకాలం జాప్యం చేస్తారని ప్రశ్నించింది..కౌంటర్ దాఖలు చేయడానికి చివరి అవకాశాన్ని ఇస్తున్నామని తెలిపింది. విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది..

Spread the love