Recent Posts

సోమిరెడ్డిపై పలు సెక్షన్స్ క్రింద కేసులు నమోదు

నెల్లూరు: టీడీపీ సీనియ‌ర్ నేత,మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డిపై నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నం పోర్టు పోలీస్ స్టేష‌న్‌లో కేసులు న‌మోద‌య్యాయి.. ఆనంద‌య్య మందును ఆన్‌లైన్‌లో పంపిణీ చేస్తున్నారని, ఆన్‌లైన్‌లో పంపిణీ పేరుతో కాకాణీ కోట్లు సంపాదించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని సోమిరెడ్డి శనివారం ఆరోపించారు..ఈ ఆరోప‌ణ‌ల‌ను శ్రేశిత టెక్నాల‌జీ ఎం.డీ న‌ర్మ‌ద కుమార్ ఖండించారు..న‌ర్మ‌ద కుమార్ ఫిర్యాదుతో సోమిరెడ్డిపై చీటింగ్‌, ఫోర్జ‌రీ, దొంగ‌త‌నం, ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసులు న‌మోదు చేశారు..సోమవారం నుంచి ఆనంద‌య్య మందు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.. కృష్ణ‌ప‌ట్నం ఎవ‌రూ రావొద్ద‌ని, అంద‌రికీ మందు అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు  తెలిపారు..

Spread the love