Recent Posts

దాసరి కుమారులపై కేసులు నమోదు

హైదరాబాద్: అప్పు తీర్చమని అడిగేందుకు వెళ్లితే, చంపేస్తామని బెదిరించినందుకు ప్రముఖ సినీ దర్శకుడు,స్వర్గీయ దాసరి.నారాయణరావు కుమారులపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.గుంటూరు జిల్లాకు చెందిన అట్లూరి సోమశేఖర్‌రావు ఎల్లారెడ్డిగూడలో నివసిస్తున్నారు.అయనకు దాసరి నారాయణరావుతో సన్నిహిత సంబంధాలు వుండేవి.దాసరి ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు పలు దఫాలుగా సోమశేఖరరావు వద్ద రూ.210 కోట్లు అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చమన్నందుకు చంపేస్తామని భయపెట్టిన ప్రముఖ సినీ దర్శకుడు, దివంగత దాసరి నారాయణరావు కుమారులపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన అట్లూరి సోమశేఖర్‌రావు ఎల్లారెడ్డిగూడలో నివసిస్తున్నారు. దాసరి నారాయణరావుతో ఆయన సన్నిహితంగా ఉండేవారు. దాసరి ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు పలు దఫాలుగా సోమశేఖరరావు వద్ద రూ. 2.10 కోట్లు అప్పు తీసుకున్నారు.దాసరి మరణానంతరం పెద్దల సమక్షంలో ఆయన కుమారులు దాసరి ప్రభు, అరుణ్‌ లు 2018 నవంబర్ లో రూ.2.10 కోట్ల ఇవ్వలేమని,రూ.1.15  కోట్లు చెల్లించేందుకు అంగీకరించారు.అయితే అప్పటి నుంచి వారు డబ్బు ఇవ్వలేదు.దింతో సోమశేఖరరావు మంగళవారం జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 46లోని దాసరి నివాసానికి వెళ్లి ప్రభు, అరుణ్‌ను డబ్బులు ఇవ్వమని అడిగితే,మరోసారి ఇంటికి వస్తే చంపేస్తామంటూ వారు తనను భయపెట్టారని పోలీసులకు బాధితుడి ఫిర్యాదు చేశారు.పోలీసులు వారిద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

Spread the love