Recent Posts

రాష్ట్రంలో మే5వ తేది ఉదయం 6 నుంచి 12 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి

పాక్షిక కర్ఫ్యూ..

అమరావతి: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఏ మాత్రం తగ్గక పోవడంతో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది..ముఖ్యమంత్రి జగన్ మంత్రులు,సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు..మే-5వ తేది నుంచి పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది..ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఇచ్చింది..ఈ సమయంలో కూడా ప్రజలు గుంపులు గుంపులుగా వుంటే చర్యలు తీసుకుంటారు..అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది..మధ్యహ్నం 12 గంటల నుంచి రెండు వారాల పాటు కర్ఫ్యూ కొనసాగనుంది..కర్ఫ్యూకి సంబంధించి పూర్తి విధి విధానలను సాయంత్రం విడుదల చేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి నాని తెలిపారు..

Spread the love