Recent Posts

వైసీపీలో బొత్స.సత్యనారాయణ పరిస్థితి చూస్తుంటే బాధేస్తోంది-జనసేనాని పవన్

అమరావతి: వైసీపీలో బొత్స.సత్యనారాయణ పరిస్థితి చూస్తుంటే బాధేస్తోంది,,ఉమ్మడి రాష్ట్రానికి సీఎం అయ్యే అవకాశాన్ని చిటికెలో కొల్పోయిన వ్యక్తి,,అలాంటి గొప్ప నేత బొత్సకు కనీసం హోం మంత్రో.. పరిశ్రమల మంత్రో.. ఆర్థిక మంత్రో అవుతారు అనుకున్నా… కానీ, చివరికి మున్సిపల్‌ శాఖ మంత్రి పదవి ఇచ్చి.. ఆ తర్వాత సహాయ మంత్రిగా మార్చేశారంటు మంత్రి బొత్స సత్యనారాయణపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ సెటైర్లు వేశారు..మంగళశారం అయన విజయనగరంలో జనసేన కార్యకర్తల సమావేశం సందర్బంలో మాట్లాడుతూ వైసీపీలో ఏ మంత్రికి,,వారి వారి శాఖల గురించి మాట్లాడే హక్కు లేదు,,బొత్స పరిస్థితి కూడా అంతే,,అందుకే ఆయనను సహాయ మంత్రి అన్నాను..సుమారు 28 నుంచి 30 శాతం జనాభా ఉన్న బలమైన సామాజిక వర్గం నుంచి వచ్చిన బొత్స పరిస్థితి ఇవాళ చాలా దయనీయంగా ఉందని,, వైసీపీలో బొత్స మరింత ఎదగాలని కోరుకుంటున్నాను అంటూ వ్యంగ్యగా వ్యాఖ్యనించారు..బొత్స ప్రస్తుత పరిస్థితికి చింతిస్తూ,,ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అంటూ కామెంట్ చేశారు..బొత్స గతంలో మాదిరిగా బెల్ట్‌ షాపుల ద్వారా కాకుండా,,ప్రభుత్వం ద్వారానే మద్యపాన నిషేధం అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు..

Spread the love
error: Content is protected !!