Recent Posts

అఖిలేష్ కు దెబ్బ మీద దెబ్బ-బీజెపీ తీర్దం పుచ్చుకున్న ఎస్పీ నేత..

అమరావతి: ఉత్తరప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి..నిన్నటి వరకు బీజెపీ నుంచి ఎస్పీలోకి మంత్రులు,ఎమ్మేల్యేలు చేరిపోయారు..అయితే బుధవారం నుంచి ఎస్పీకి చెందిన ముఖ్య నేతలు అయిన ఆపర్ణ యాదవ్ బీజెపీ తీర్దంపుచ్చుకోగా,నేడు ములాయం సింగ్ యాద‌వ్ తోడ‌ల్లుడు ప్ర‌మోద్ గుప్తా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు..ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎస్పీపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.   సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ఆఖిలేష్,,మాఫియా నాయ‌కుల‌ను పార్టీలో చేర్చుకుంటున్నార‌ని,,సదరు పార్టీలో ములాయం సింగ్ యాద‌వ్ ఖైదీగా మారిపోయార‌ని, శివ‌లాల్ యాద‌వ్ ప‌ట్ల కూడా అఖిలేష్ యాద‌వ్ దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, అందుకే ఆ పార్టీలో ఉండ‌లేక‌పోతున్నాన‌ని ప్ర‌మోద్ గుప్తా పేర్కొన్నారు..దింతో ఎస్పీ పార్టీలో ప్రమోద్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.మరి రాబోయే 10 రోజుల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే???

Spread the love
error: Content is protected !!