Recent Posts

బీజెపీ కండువా కప్పుకున్న ఈటెల.రాజేందర్

అమరావతి: TRS మాజీ మంత్రి, తెలంగాణలోని కీలకనేత ఈటల రాజేందర్‌ సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్,బీజెపీ రాష్ట్ర వ్యవహరాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు.. ఈటలతో పాటు ఆదిలాబాద్ మాజీ MP రమేష్ రాథోడ్,,మాజీ MLA ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్‌ ZP మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, గండ్ర నళిని, RTC కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి, అందె బాబయ్య తదితరులు బీజేపీలో చేరారు..ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు..

Spread the love