Recent Posts

రాహుల్ గాంధీ‌పై బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర సంచలన ఆరోపణలు!

అమరావతి: కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ‌పై బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ విదేశీ రహస్య పర్యటనల సమయంలోనే దేశంలో కీలక ఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు..ఈ ఘటనలను అయన గుప్త ప్రయోగంగా అభిప్రాయపడ్డారు..గత మూడు సంవత్సరాలుగా దేశంలో వివిధ సంఘటనలు రాహుల్ విదేశీ పర్యటనల సమయంలోనే చోటుచేసుకున్నాయన్నారు.ఇది గుప్త ప్రయోగ్ (రహస్య ప్రయోగం) అని ఓ ట్వీట్‌లో సంబిత్ పాత్ర పేర్కొన్నారు..ఈ సంఘటనలకు సంబంధించిన గ్రాఫిక్స్‌ ఫోటోను ఆయన షేర్ చేశారు. ఢిల్లీ అల్లర్లు, రెడ్ ఫోర్ట్ హింసాకాండ, ప్రధాని భద్రతా లోపం,,లాంటి సంఘటనలను వరుస క్రమంలో చూపించారు..రాహుల్ గాంధీ దేశంలో లేనప్పుడే ఈ ఘటనలు జరిగాయని, ఇది గుప్త ప్రయోగమని పేర్కొన్నారు..

Spread the love
error: Content is protected !!