Recent Posts

హుజూరాబాద్ ఉపఎన్నికలో TRS పై BJP అభ్యర్ది ఈటల భారీ విజయం

 బద్వేల్‌లో రికార్డు నెలకొల్పిన వైసీపీ అభ్యర్ది..

అమరావతి: తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 23, 855 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు..ఈటల రాజేందర్‌కు 1 లక్షా 07 వేల 022 ఓట్లు రాగా,, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 83,167ఓట్లు వచ్చాయి..2004 నుంచి వరుసగా ఈటల రాజేందర్ 7సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు..ఈటల రాజేందర్ విజయం సాధించడంతో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.హైదరాబాద్ గన్ పార్క్ వద్ద అమరవీరులకు బీజేపీ నేతలు నివాళులర్పించి స్వీట్స్ పంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఈటల గెలుపును అడ్డుకోలేకపోయారన్నారు.2023లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఈ విజయం సంకేతమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడపజిల్లా పరిధిలోని బద్వేల్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ దాసరి.సుధ 90,533ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించింది.. వైసీపీకి 1,11,710 ఓట్లు,,బీజేపీ 21,621 ఓట్లు,,కాంగ్రెస్ 6,205 ఓట్లు సాధించాయి..బద్వేల్ ఉప ఎన్నిక ద్వారా వైసీపీ అభ్యర్థి డా.సుధ ఏకంగా సీఎం జగన్ రికార్డునే అధిగమించారు.బద్వేల్ ఉప ఎన్నికలో ఆమె రికార్డు మెజారిటీతో ఘనవిజయం సాధించారు. 2019లో కడప జిల్లా పులివెందుల నుంచి పోటీ చేసిన జగన్ టీడీపీ అభ్యర్థి సతీష్ కుమార్ రెడ్డిపై 90,110 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.జగన్ నెలకొల్పిన మెజారిటీ రికార్డును బద్వేల్ వైసీపీ అభ్యర్థి డా.సుధ అధిగమించారు.ఆమె 90,533 ఓట్ల మెజారిటీతో జగన్ కంటే ఎక్కువ ఓట్లు సాధించి కనివినీ ఎరుగని రీతిలో విజయాన్ని తన బుట్టలో వేసుకున్నారు..బద్వేల్ ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీ చేయలేదు. కేవలం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే పోటీ చేశాయి.టీడీపీ పోటీ చేయకపోవడంతో ఆ పార్టీ ఓట్లు కూడా వైసీపీకే పడినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Spread the love
error: Content is protected !!