Recent Posts

విడాకులు తీసుకుంటున్న బిల్‌‌గేట్స్ ఆయన భార్య మెలిందా

అమరావతి: మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌‌గేట్స్ ఆయన భార్య మెలిందా విడాకులు తీసుకుంటున్నారు..పెళ్లయిన 27 ఏళ్ల తర్వాత ఈ జంట విడాకులు తీసుకోనుండటం గమనించతగ్గ ఆంశం..ప్రస్తుతం బిల్‌గేట్స్‌ వయసు 65 ఏళ్లు కాగా ఆయన భార్య మెలిందా వయసు 56 ఏళ్లు..ఈ విషయాన్ని బిల్‌‌గేట్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.. ‘మా వైవాహిక బంధం గురించి ఎన్నో సమాలోచనలు జరిపాక మేం ఓ నిర్ణయానికి వచ్చిన తరువాత ఈ పెళ్లి బంధాన్ని ముగించాలనుకుంటున్నాం..ఇన్నేళ్ల సంసార జీవితంలో ముగ్గురు అద్భుతమైన పిల్లల్ని తీర్చిదిద్దాం..దీంతోపాటు మా ఫౌండేషన్‌ను ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఆరోగ్యంగా,, నిర్మాణాత్మకంగా ఎదిగేలా కృషి చేశాం..ఇకపై ఫాండేషన్ పనుల్లో కలసికట్టుగా పని చేస్తాం కానీ భార్యాభర్తలుగా కలిసుండలేం..కొత్త జీవితాలను ప్రారంభించనున్నాం’ అని గేట్స్ ట్వీట్ చేశారు..బిల్‌‌గేట్స్ దంపతులు విడిపోతున్నప్పటికీ బిల్‌‌మెలిందాగేట్స్ ఫౌండేషన్‌లో వారిద్దరూ ట్రస్టీలుగా, కో చైర్స్‌‌గా కొనసాగుతారని ఆ ఫౌండేషన్ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.. 

Spread the love