Recent Posts

కన్నుల పండుగగా సాగిన భద్రాద్రి రాముడి కల్యాణం

అమరావతి: భద్రాద్రి రాముడి కల్యాణం కన్నుల పండుగగా సాగింది.ప్రతి సంవత్సరం మిథిలా స్టేడియంలో నిర్వహించే రామయ్య కల్యాణాన్ని కరోనా కారణంగా నిత్యకల్యాణ మండపంలో జరిపించారు..బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రే ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు..భక్త రామదాసు స్వయంగా చేయించిన దివ్యాభరణాలను సీతారాముల స్వర్ణ మూర్తులను సుందరంగా అలంకరించారు.. శోభాయమానంగా అలంకరించిన ఉత్సవమూర్తులను పల్లకిపై కొలువుదీర్చి,,ఆలయ ప్రాంగణంలో బేడా మండపంలో రామచంద్రమూర్తి,, సీతమ్మలను అభిముఖంగా కూర్చోబెట్టారు. కొందరు అర్చకులు రామయ్య తరపున,,మరికొందరు అర్చక స్వాములు సీతమ్మవారి తరపున ప్రతినిధులుగా వ్యవహరించి ఎదుర్కోలు ఉత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు..ఈ సమయంలో అయోధ్య నుంచి రాముడు, మిథిల నుంచి సీతమ్మ తల్లి వచ్చినట్లుగా వర్ణించారు..అనంతరం సీతారామచంద్రులను పక్క పక్కన ఆశీనులను చేసి ప్రత్యేక హారతి సమర్పించారు. కోదండరాముని కల్యాణానికి ప్రభుత్వం త‌ర‌పున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి దంప‌తులు ప‌ట్టు వ‌స్ర్తాలు స‌మ‌ర్పించారు..కరోనా కారణంగా కేవలం 50మంది వీఐపీల సమక్షంలోనే స్వామివారి కల్యాణం జరిగింది..

Spread the love