Recent Posts

ఐపీఎల్‌ 2021ను నిరవధికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం

అమరావతి: IPLలోని పలు జట్ల ఆటగాళ్లు కరోనా వైరస్‌ బారిన పడుతుండటంతో BCCI మంగళవారం కీలక నిర్ణయం ప్రకటిస్తు,, 2021 14వ సీజన్‌ IPL మ్యాచ్‌లను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు BCCI ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్ల ప్రకటించారు..ఆటగాళ్ల కరోనా బారిన పడుతుండటంతో తాజా పరిస్థితులపై చర్చించేందుకు IPL,,BCCI అత్యవసర సమావేశాన్ని నిర్వహించాయి..ఈ సమావేశంలో IPL 2021ను నిరవధికంగా వాయిదా వేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు..ఆటగాళ్లు,,సహాయక సిబ్బంది భద్రత విషయంలో BCCI రాజీపడదని,,అందరి క్షేమం దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు BCCI వెల్లడించింది..రెండు రోజులుగా IPLలోని పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడుతున్నారు..సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వికెట్ కీపర్ వృద్ధిమాన్‌ సాహాకు కరోనా నిర్ధారణ కావడంతో ఆ జట్టు ఆటగాళ్లు ఐసోలేషన్‌లోకి వెళ్లారు..అలాగే ఢిల్లీ క్యాపిటల్స్‌ వెటరన్ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా కూడా కరోనా బారినపడ్డాడు..ఢిల్లీ మైదానంలో సిబ్బందిలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ తేలింది..కోల్‌కతా ఆటగాళ్లు వరణ్‌ చక్రవర్తి,,సందీప్‌ వారియర్‌లకు ఆదివారం చేసిన పరీక్షల్లో కరోనా నిర్ధరణ అయింది..బయో బబుల్‌లో కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ ఆటగాళ్లు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది..దింతో ఆటగాళ్ల రక్షణ ముఖ్యమని భావించి BCCI  ప్రస్తుత సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది..

IPL 2021ను నిర్వహణపై బాంబే హైకోర్టులో పిటీషన్‌:-దేశంలో కరోనా వైరస్  సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్నసమయంలో IPL 2021ను నిర్వహించిన BCCIకి రూ.1000కోట్ల జరిమానా విధించాలని బాంబే హైకోర్టులో ఓ పిటీషన్‌ దాఖలైంది..కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా భారత్‌లో కరోనా మరణాలు, పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకొని IPL 14వ సీజన్‌ను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం దాఖలైన పిటిషన్‌ను బాంబే కోర్టు డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జిఎస్ కులకర్ణి గురువారం ఈ విషయాన్ని విచారించడానికి అంగీకరించారు.

Spread the love