Recent Posts

ఈ నెల 29న BCCI సర్వసభ్య సమావేశం-నిలిచిపోయిన IPL 2021 సీజన్ పై నిర్ణయం ?

అమరావతి: కరోనా సెకండ్ వేవ్ కారణంగా IPL 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కసరత్తులు ప్రారంభించింది..షెడ్యూల్ ప్రకారం 60 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా 29 మ్యాచ్‌లు ముగిసే సమయానికి IPL జట్లలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో టోర్నీని BCCI వాయిదా వేసింది..దింతో మిగిలిన 31 మ్యాచ్‌ల నిర్వహణతో పాటు ఈ సంవత్సరం అక్టోబరు-నవంబరులో జరగనున్న T20 World Cup  ఆతిథ్యంపై కూడా BCCI ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.. ఈ నెల 29న జరగున్న BCCI సర్వసభ్య సమావేశంలో IPL తో సహా T20 World Cup నిర్వహణపై స్పష్టతకు వచ్చే ఆవకాశం వుంది..ఇప్పటి వరకూ అందిన సమాచారం మేర ఇంగ్లాండ్‌లో IPL 2021 సీజన్‌ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది.. ఆటు తరువాత T20 World Cup మాత్రం UAE లో నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి..ఇదే సమయంలో T20 World Cup,IPL 2021 సీజన్‌కి ఆతిథ్యం ఇచ్చేందుకు శ్రీలంక కూడా ఆసక్తిగా చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..జూన్ 2వ తేదిన ఇంగ్లాండ్‌కి వెళ్లనున్న టీమిండియా, అక్కడ సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జూన్ 18 నుంచి 23 వరకూ ICC వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌‌లో తలపడి,,ఆటు తరువాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకూ ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌‌లో ఢీకొట్టబోతోంది..ఈ సిరీస్ కోసం కఠినమైన బయో -సెక్యూర్ బబుల్‌ని ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ఏర్పాటు చేయనుంది..ఏర్పాట్లుపై  సంతృప్తికరంగా వున్నట్లయితే సెప్టెంబరులో IPL 2021 సీజన్‌ని అక్కడే నిర్వహించడానికి BCCI మొగ్గు చూపుతున్నట్లు సమాచారం..

Spread the love