Recent Posts

T20 వరల్డ్ కప్ వేదికలను ఖరారు చేసిన బి.సి.సి.ఐ

అమరావతి: అక్టోబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న2021 T20 వ‌ర‌ల్డ్‌ క‌ప్‌కు వేదిక‌లను బీసీసీఐ ఖరారు చేసింది..మ్యాచ్ లను 8 వేదికల్లో నిర్వహించనున్నట్టు సమాచారం..ఢిల్లీ,, ముంబై,,చెన్నై,,కోల్‌క‌తా,,బెంగుళూరు,,హైద‌రాబాద్,, ధ‌ర్మ‌శాల న‌గ‌రాల్లో టీ20 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి..వ‌ర‌ల్డ్‌ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌ల‌ను అహ్మ‌దాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వ‌హించ‌నున్నారు..ఇదే సమయంలో పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టుకు వ‌ర‌ల్డ్‌ క‌ప్‌లో పాల్గొనేందుకు వ‌చ్చే పాక్  జ‌ట్టుకు ఎటువంటి వీసా స‌మ‌స్య‌లు ఉండ‌వ‌ని బీసీసీఐ సెక్రటరీ జే షా తెలిపారు..పాకిస్థాన్ ఆట‌గాళ్లు వీసా ఇచ్చే విషయంలో ప్ర‌భుత్వం అంగీకరం తెలిపినట్లు జే షా చెప్పారు..ఆట‌గాళ్ల‌కు వీసాలు ఇచ్చినా,, విదేశీ అభిమానులకు వీసాలు ఇవ్వాలా వ‌ద్దా అనే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు..దీనిపై కూడా త్వ‌ర‌లో నిర్ణ‌యం తీసుకోనున్నట్లు తెలిపారు..

Spread the love