Recent Posts

ప్రభుత్వ పధకాలకు బ్యాంకులు మరింత తోడ్పాటును అందించాలి-ఆర్ధికమంత్రి బుగ్గన

ఎస్ఎల్బిసి సమావేశంలో

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలకు బ్యాంకులు మరింత తోడ్పాటును అందించాలని రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి విజ్ణప్తి చేశారు.సోమవారం అమరావతి సచివాలయం 214వ రాష్ట్ర స్థాయి బ్యాంకరుల కమిటీ (ఎస్ఎల్బిసి) సమావేశం జరిగింది.ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవిడ్ వంటి ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనేక పధకాలను నిరంతరాయంగా అమలు చేయడం జరుగుతోందని పేర్కొన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పధకాలను మరింత విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళేందుకు బ్యాంకులు కూడా అన్ని విధాలా సహకారాన్ని అందించాలని విజ్ణప్తి చేశారు..సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ కౌలు రైతులకు ఋణాలు మంజూరులో మెరుగైన ఫలితాలు సాధించక పోవడంపై గత డిశంబరులో జరిగిన ఎస్ఎల్బిసి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని బ్యాంకరులకు గుర్తుచేసి వచ్చే ఆర్ధిక సంవత్సరంలోనైనా కౌలు రైతులకు మెరుగైన రీతిలో ఋణాలు అందించేందుకు ప్రణాళికల రూపొందించాలని కోరారు.అలాగే కిసాన్ క్రెడిట్ కార్డులకు సంబంధించి వ్యవసాయంతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలైన మత్స్య,పశుగణాభివృద్ధి వంటి రంగాల్లోను రైతులకు కూడా సహాయం అందించాలని విజ్ణప్తి చేశారు..నాబార్డు సిజియం సుధీర్ జన్నావర్ మాట్లాడుతూ దేశంలో అత్యధిక మంది కౌలు రైతులకు ఋణాలందిస్తున్న రాష్ట్రం ఎపి అన్నారు.అన్ని బ్యాంకులు మెరుగైన లక్ష్యాలు సాధించడం పట్ల కొనియాడారు.ముఖ్యంగా వ్యవసాయానికి పెద్ద ఎత్తున ఋణం సౌకర్యం అందించడం జరుగుతోందన్నారు.రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా జియం సుందరం శంకర్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో క్రెడిట్ రేట్ 6.2శాతంగా ఉండగా ఎపిలో 15.92శాతంగా ఉండడం అభినందనీయని బ్యాంకరులను కొనియాడారు..

Spread the love