Recent Posts

భార్య వేధింపులు భరించలేక బ్యాంకు ఉద్యొగి ఆత్మహత్య

హైదరాబాద్: సమాజంలో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట భర్త వేధింపులకు భరించలేక భార్యలు ఆత్మహత్యలు చేసుకున్నరు అంటు వార్తలు చూస్తుంటాం..అయితే భార్య వేధింపులు తట్టుకోలేక సంతోష్ అనే బ్యాంక్ ఉద్యోగి సెల్ఫీ వీడియో తీసుకొని కూల్ డ్రింక్ లో పురుగులు సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు..ఇరుపొరుగు వారు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ అక్కడ చికిత్స పొందుతూ సంతోష్ మరణించాడు.. గోల్కొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,, సంతోష్ 2013లో హైదరాబాద్ పాత బస్తీకి చెందిన కళ్యాణి అనే మహిళను  వివాహం చేసుకున్నాడు..వీరికి అభిరామ్ అనే కొడుకు వున్నాడు..అయితే గత కొంత కాలంగా అభిరామ్,అనారోగ్య సమస్యలతో భాద పడుతున్నట్లు సమాచారం..అప్పటి నుంచి భర్త సంతోష్ ను భార్య వేధింపులకు గురిచేసినట్లు సెల్ఫీ వీడియోలో సంతోష్ పేర్కొన్నాడు..అంతే కాకుండా తనపై ఇప్పటికి మూడుసార్లు హత్యాయత్నం కూడా చేశారన్నారు..దింతో పాటు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశాడు.. భార్య పెట్టే టార్చర్ భరించడం కంటే చావే ప్రశాతంగా వుంటుందని,, ఆన్ లైన్ లో పురుగులు మందు ఆర్డర్ చేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు..సంతోష్ సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..

Spread the love
error: Content is protected !!