Recent Posts

బ్యాంకు ఖాతాదారుడి వివరాలను సమాచార హాక్కు చట్టం క్రింద ఇవ్వలేం-సుప్రీంను ఆశ్రయించిన బ్యాంకులు

అమరావతి: బ్యాంకు ఖాతాదారుడి వివరాలను సమాచార హాక్కు చట్టం క్రింద ఇవ్వలంటు ఆర్బీఐ తాజాగా జారీ చేసిన ఆదేశాలను ఆమలు చేసేందుకు పలు ఇబ్బందులు వున్నయని,,ఆర్బీఐ అదేశాలను అమలు చేయలేమంటు రిజర్వుబ్యాంకు జారీ చేసిన ఆదేశాలపై స్టే ఇవ్వాలంటూ బ్యాంకులు,సుప్రీమ్ కోర్టును ఆశ్రయించాయి..ఖాతాదారుల ఆర్దిక వివరాలు అత్యంత సున్నితమైన,, బ్యాంకు ఆర్థిక లావాదేవీలతో ముడిపడిన విషయాలన్ని బహిర్గతమౌతాయనే ఆందోళన వ్యక్తం చేశాయి..బ్యాంకులకు సంబంధించిన ఆర్థికపరమైన లావాదేవీల డేటాను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకుని రావాలంటూ ఇటీవలే రిజర్వుబ్యాంకు ఆదేశించింది..అన్ని ప్రభుత్వ,, ప్రైవేటు బ్యాంకులను దీని పరిధిలోకి తీసుకొచ్చింది..ఏ ఖాతాదారుడైనా లేక ఖాతేతరుడైనా సంబంధిత బ్యాంక్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను తనకు అందజేయాలంటూ సమాచార హక్కు చట్టం కింద కోరితే,,వారడిగిన వివరాలను అందజేయాలని సూచించింది..ఈ ఆదేశాలపై బ్యాంకులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తు రిజర్వుబ్యాంకు ఆదేశాలను అమలు చేయలేమంటూ ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై స్టే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశాయి..ఈ మేరకు SBI,,HDFC ఉమ్మడిగా సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశాయంటు ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రచురించింది.. జస్టిస్ లావు నాగేశ్వర రావు,, జస్టిస్ అనిరుధ్ బోస్‌తో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటీషన్‌పై వాదనలు చేపట్టినట్లు పేర్కొంది..SBI తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా,,HDFC తరఫున సీనియర్ అడ్వొకెట్ ముకుల్ రోహత్గీ తమ వాదనలను వినిపించనున్నారు..బ్యాంకింగ్ సెక్టార్‌లో నెలకొన్న పోటీ వాతావరణంలో తమ ఆర్థిక మూలాలతో ముడిపడి ఉన్న సున్నిత సమాచారాన్ని బహిర్గతం చేయలేమని బ్యాంకులు స్పష్టం చేశాయి..

Spread the love