Recent Posts

డ్రాగన్ దేశంకు చెందిన మరో 54 మొబైల్ అప్లికేషన్‌లపై నిషేధం

అమరావతి: దేశ భద్రతకు,,పౌరుల వ్యక్తిగత డేటాకు ముప్పుగా పరిణమించే 54 చైనీస్ మొబైల్ అప్లికేషన్‌లపై నిషేధం విధించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు..ఎలక్ట్రానిక్స్,, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ భారతదేశంలో ఐటీ యాక్ట్ 69ఏ ప్రకారం ఈ యాప్స్ పై నిషేధిస్తూ అధికారికంగా నోటిఫికేషన్‌ను జారీ చేసింది.. 2020లో 224 చైనా యాప్ లపై బ్యాన్ విధించింది..ప్రతికూల భద్రతా ఇన్‌పుట్‌లు రూపొందించబడిన యాప్‌లలో బ్యూటీ కెమెరా, స్వీట్ సెల్ఫీ హెచ్ డీ, బ్యూటీ కెమెరా- సెల్ఫీ కెమెరా, ఈక్వలైజర్ అండ్ బాస్ బూస్టర్, క్యామ్ కార్డ్ ఫర్ సేల్స్ ఫోర్స్ ఈఎన్టీ, ఐసోలాండ్-2 యాషెస్ ఆఫ్ టైమ్ లైట్, వీవా వీడియో ఎడిటర్, ఆన్ మైయోజీ చెస్, ఆన్ మై ఓజీ ఎరీనా, యాప్ లాక్, డ్యూయల్ స్పేస్ లైట్ యాప్ లను నిషేధించినట్లు తెలిపాయి కేంద్ర వర్గాలు. భారతీయులకు సంబంధించిన సెన్సిటివ్ సమాచారాన్ని చైనాలో ఉన్న సర్వర్లకు చేరవేస్తున్నట్లు గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు..ఇకపై ప్లే స్టోర్ లో కూడా ఈ యాప్స్ మన దేశంలో అందుబాటులో ఉండవని అన్నారు. ఐటీ యాక్ట్ 69ఏ ప్రకారం ఈ యాప్స్ పై బ్యాన్ ఆదేశాలిచ్చినట్లు చెప్పారు.

Spread the love
error: Content is protected !!