Recent Posts

MBT నేత వేధింపులతో మహిల జర్నలిస్టు ఆత్మహత్య యత్నం

హైదరాబాద్‌: నగరంలోని డబీర్‌పురాకు చెందిన MBT నేత సయ్యద్ సలీం (66) వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఓ న్యూస్ చానల్‌లో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టు ఆత్మహత్యకు యత్నించింది.. సెల్ఫీ వీడియో తీసుకుని నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఒవైసీ ఆస్పత్రికి తరలించారు..ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతుంది..గుల్షన్-ఎ-ఇక్బాల్ కాలనీకి చెందిన సయ్యదా నాహీదా ఖాద్రీ(37)  ఓ న్యూస్ చానల్‌లో పనిచేస్తున్నారు.. MBT నేత సలీం కొద్ది రోజులుగా అసభ్యకర వీడియోలు, ఫొటోలు  సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు..అతని వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన ఖాద్రీ,,తనకు ఆత్మహత్య తప్ప మరో దారి కనిపించడం లేదని సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేస్తూ,, శనివారం రాత్రి ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు..ఖాద్రీ కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సలీంను అరెస్ట్ చేశారు..

Spread the love