అమరావతి: చైనాలోని హాంగ్జావ్ నగరంలో సెప్టెంబర్లో జరగాల్సిన 2022 ఆసియా క్రీడలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు నిర్వాహకులు శుక్రవారంనాడు తెలిపారు. చైనాలో కోవిడ్ కేసులు పెరుగుతుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే నిర్వాహకులు మాత్రం క్రీడల వాయిదాకు స్పష్టమైన కారణాన్ని ప్రకటించలేదు. సెప్టెంబర్ 10 నుంచి 25 వరకూ హాంగ్జావ్ నగరంలో 19వ ఆసియా క్రీడలను వాయిదా వేస్తున్నట్లు ఆఫీషియల్ వెబ్ సైట్ పేర్కొందని చైనా మీడియా తెలిపింది..తిరిగి ఎప్పుడు క్రీడలు నిర్వహించేదే త్వరలోనే తెలియచేస్తారని పేర్కొన్నారు..
19వ ఏషీయన్ గేమ్స్ వాయిదా
