Recent Posts

అశోక్ గ‌జ‌ప‌తి రాజునే ట్రస్ట్ ల చైర్మ‌న్ గా కొనసాగించండి-హైకోర్టు

అమరావతి: విజయనగరంలో గజపతిరాజుల కుటుంబ గొడవలు తారాస్థాయికి చేరిన సంగతి విదితమే..రాష్ట్ర ప్రభుత్వం ఆశోక్ గజపతిరాజును తప్పిస్తు మాన్సాస్‌,, సింహాచ‌లం ట్ర‌స్టుల ఛైర్‌పర్సన్‌ గా సంచయితను నియమించింది.. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు నియామక జీవోను స‌వాలు చేస్తూ హైకోర్టును ఆశ్ర‌యించారు..దీనిపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న హైకోర్టు ప్ర‌భుత్వం జారీ చేసిన జీవో 72 ను హైకోర్టు కొట్టివేసింది..మ‌హాల‌క్ష్మీ దేవ‌స్థానం, మాన్సాస్ ట్ర‌స్ట్‌ కు అశోక్ గ‌జ‌ప‌తి రాజునే చైర్మ‌న్ గా కొనసాగేలా ఆదేశాలు జారీచేసింది..గ‌తంలో మాన్సాస్‌, మ‌హాల‌క్ష్మీ దేవ‌స్థానం ట్ర‌స్ట్‌ల‌కు అశోక్ గ‌జ‌ప‌తిరాజు చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించేవారు..వైసీపీ ప్రభుత్వం వచ్చక ఆయ‌న్ను త‌ప్పిస్తూ ప్ర‌భుత్వం జీవో 72 ను తీసుకొచ్చింది..ఆయ‌న స్థానంలో సంచ‌యిత‌ను ప్ర‌భుత్వం ట్ర‌స్ట్ చైర్మ‌న్‌గా నియ‌మించింది..దీనిపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ అశోక్ గ‌జ‌ప‌తిరాజు హైకోర్టులో రిట్ పిటీష‌న్ దాఖ‌లు చేశారు..ఇదే సమయంలో సంచ‌యిత వేసిన పిటీష‌న్‌ను కూడా హైకోర్ట్ తోసిపుచ్చింది..అలాగే సింహాచ‌లం ట్ర‌స్ట్‌ కు కూడా అశోక్ గ‌జ‌ప‌తి రాజును కొన‌సాగించాల‌ని హైకోర్టు ఆదేశించింది..

Spread the love