Recent Posts

డ్రగ్స్ పార్టీలో దొరికిన షారుఖ్ ఖాన్ పెద్దకొడుకు ఆర్యన్ ఖాన్

అమరావతి: రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడుతున్న 10 మందిని..అధికారులు శనివారం రాత్రి అరెస్ట్ చేయగా,అందులో షారుఖాన్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ వున్నాడు..విషయంలోకి వెళ్లితే…లగ్జరీగా ఖర్చు పెట్టేందుకు కోట్ల రూపాయలు చేతిలో వుంటే కోటీశ్వరుల కొడుకులు ఖాళీగా వుంటారా ? మత్తు కోసం మందు కొట్టే రోజులు పోయాయి..డ్రగ్స్ తో ఎంజాయి చేయడమే అటు సినిమా ఇండ్రస్టీలో,ఇటు కోటీశ్వరుల పుత్రరత్నాలకు ఆలవాటుగా మారిపోయింది…ఈ నేపధ్యంలో 15 రోజుల క్రిందట గోవాలో ఎఫ్‌టీవీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఖాషిఫ్ ఖాన్ (డ్రగ్స్) రేవ్ పార్టీని మూడ్రోజుల పాటు మ్యూజికల్‌ వోయెజ్‌ పేరుతో డిజైన్ చేశారు..శనివారం రాత్రి అందుకు అనుగుణంగా సముద్రంలో ప్రయాణించే క్రూయిజ్ (నీటిమిద కదిలే స్టార్ హోటల్)లో టిక్కెట్ ఒక్కొక్కటి లక్షరూపాయలుగా ఫిక్స్ చేశాడు..ఇక్కడి నుంచి ఆసలు తంతు మొదలైంది..బడా బాబుల పుత్రికలు,పుత్రరత్నాలకు టిక్కెట్స్ ను అందించారు..పార్టీలో భారీగా డ్రగ్స్,ముద్దుగుమ్మలు, డీజే సౌండ్స్‌ తో మజా చేసుకుంటున్నారు..మెరుపు వేగంతో  క్రూయిజ్ లోకి ప్రవేశించిన NCB(నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) అధికారులు,10 మందిని అదుపులోకి తీసుకున్నారు..అరెస్ట్ అయిన వారిలో యువతులు కూడా ఉన్నారు..భారీగా డ్రగ్స్‌తో పాటు లక్షల రూపాయలు నగదును సీజ్‌ చేశారు..NTPC యాక్ట్‌ కింద వారిని అరెస్ట్‌ చేసిన అధికారులు..ఆదివారం NCB దక్షిణ ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్ కార్యాలయంలో విచారిస్తున్నారని,ఈ ఆపరేషన్ కు నేతృత్వం వహించిన NCB జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే తెలిపారు.. Crime no. Cr 94/21 క్రింద కేసు బుక్ చేసినట్ల పేర్కొన్నారు..అరెస్ట్ అయిన వారిలో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ అని,,అతడిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రశ్నిస్తోందని ఎన్‌సీబీ వాంఖడ్ తెలిపారు..అరెస్ట్ అయిన వారిలో అర్యాన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా, నుపుర్ సారికా, ఇస్మీత్ సింగ్, మోహక్ జస్వాల్, విక్రాంత్ ఛోకర్, గోమిత్ చోప్రా, గోమిత్ చోప్రాను వున్నారు..ప్రస్తుతం వీరిని ప్రశ్నిస్తున్నాం’ అని సమీర్ వాంఖడే పేర్కొన్నారు. 

Spread the love