Recent Posts

బాబా అవతారమెత్తిన సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ అరెస్ట్

హైదరాబాద్: తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో బాబా అవతారమెత్తిన సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ విశ్వచైతన్యను పోలీసులు అరెస్ట్‌ చేశారు.సాయి విశ్వచైతన్య హైదరాబాద్ లో బీటెక్‌ వరకు చదివాడు.అనంతరం విశ్వ చైతన్య పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించాడు. దానిలో షర్డీ సాయిబాబా గురించి బోధనలు చేయటం మొదలెట్టాడు.క్రమేపి  దానిక సబ్ స్త్రైబర్స్ పెరిగారు.దింతో బాబా అవతారం ఎత్తిన విశ్వచైతన్య,నల్గోండ జిల్లాలోని పీఏపల్లి మండలంలోని  అజ్మాపురంలో పది ఎకరాల విస్తీర్ణంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. షిర్డీ  సాయిబాబా ప్రవచనాలు చెబుతూ, పూజలు, హోమాలు చేస్తూ  తాయెత్తులు కడుతూ  ప్రజలనుంచి కోట్ల రూపాయలు దండుకున్నాడు.ఇటీవల తనకు ఉన్న సమస్యలనుంచి  బయట పడేస్తానని చెప్పి,డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఆరోపిస్తూ ఒక బాధిత మహిళ నల్గోండ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్పీ ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించారు.పోలీసులు ఆశ్రమంలో ఉన్న సాయివిశ్వచైతన్యను అదుపులోకి తీసుకుని,అతని వద్ద ఉన్న బంగారం,నగదు,విలువైన డిపాజిట్ లు, బాండ్లు,ల్యాప్ టాప్ లు, ప్రవచనాలకు సంబంధించిన ఇతర పుస్తకాలను కంప్యూటర్ సామాగ్రిని స్వాధీనం చేసుకుని,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

Spread the love