Recent Posts

శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఇంటి నుంచే చూసే ఏర్పాట్లు-ఆనం

నెల్లూరు: వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా గురువారం రాష్ట్ర విద్యుత్తు, అటవీ, పర్యావరణ, సైన్స్, టెక్నాలజీ శాఖ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మేల్యే మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో కలసి అమ్మ వారిని దర్శించుకుని, శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ దివ్య ఆశీస్సులు పొందారు..ఈ సందర్భంగా శాసన సభ్యులు ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ,పోలేరమ్మ జాతర కార్యక్రమం సందర్భంగా వెంకటగిరి పట్టణం అంతా విద్యుత్ దీపాలంకరణలతో తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. కోవిడ్ నిబంధల మేరకు ఏకాంతంగా నిర్వహించిన పోలేరమ్మ జాతర మహోత్సవ కార్యక్రమాలను అత్యంత వైభవంగా పూల అలంకరణ,,విద్యుత్ దీపాలంకరణలతో..లక్ష కుంకుమార్చన ప్రత్యేక పూజా కార్యక్రమాలన్నీ..భక్తులందరూ ఇంటి నుండే  వీక్షించేలా ప్రత్యక్ష ప్రసార ఏర్పాటు చేశామని తెలిపారు. కోవిడ్ మహమ్మారి నిర్ములన కోసం భక్తులకు నేరుగా దర్శన భాగ్యం కల్పించలేక పోవడం తనకు చాలా బాధాకరంగా ఉందన్నారు.కోవిడ్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే పోలేరమ్మ అమ్మ వారి జాతర ను నిర్వహించేలా అధికారులకు సూచనలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు..

Spread the love