Recent Posts

సముద్ర తీర ప్రాంతం పరిధిలో భద్రతా చర్యలను పకడ్బందీగా చేపట్టాలి-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలోని సముద్ర తీర ప్రాంతం పరిధిలో భద్రతా చర్యలను పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్ లో జిల్లాస్థాయి కోస్టల్ సెక్యూరిటీ కమిటీ సభ్యులతో  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సముద్రతీర ప్రాంతంలో భద్రతకు సంబంధించి చేపడుతున్న కార్యకలాపాలు, మత్స్యకారుల సంక్షేమం, ఇతర రాష్ట్రాల మత్స్యకారుల దాడులు తదితర అంశాలపై కమిటీ సభ్యులతో కలెక్టర్ కూలంకషంగా చర్చించారు. అలాగే జిల్లాలోని దుగరాజపట్నం, ఇసుకపల్లి, శ్రీహరికోటలో ఉన్న మెరైన్ పోలీస్ స్టేషన్ల పనితీరును కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ హరేంధిర ప్రసాద్, విశాఖపట్నం కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ అడిషనల్ ఎస్పీ శ్రీమతి విమల కుమారి, అడిషనల్ ఎస్పీ శ్రీమతి వెంకటరత్నం, డి.ఎస్.పి ఎం శ్రీనివాసరావు, కృష్ణపట్నం పోర్ట్ కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ శ్రీమతి మాధురి, డిఆర్వో చిన్న ఓబులేసు, ఆర్డిఓ హుస్సేన్ సాహెబ్, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు.

Spread the love
error: Content is protected !!