వైసీపీ అధ్యక్షడు జగన్‌రెడ్డికి విశ్వసనీయత లేదు-బాలినేని
ఈనెల 22న జనసేనలోకి..
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షడు జగన్‌రెడ్డికి విశ్వసనీయత లేదని వైసీపీ మాజీమంత్రి,జగన్ బంధువు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి విమర్శలు చేశారు..వైసీపీ కోసం త్యాగాలు చేసిన వారికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు..జగన్ పార్టీ పెట్టిన రోజున తాను రాజీనామా చేశానని గుర్తుచేశారు..మాలాంటి వారి త్యాగాలను జగన్‌రెడ్డి మరిచిపోయారని ధ్వజమెత్తారు..గురువారం డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో YSRCP కీలక నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానులు జనసేన కార్యాలయంలో సమావేశం అయ్యారు..పలు విషయాలపై దాదాపు గంటపాటు ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది.. ఈనెల 22న జనసేనలో చేరుతున్నట్లు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఉదయభానులు ప్రకటించారు.
పవన్ కళ్యాణ్‌తో సమావేశం అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నాను అని, ఒంగోలులో సభ ఏర్పాటు చేసి అక్కడ జనసేన కండువా కప్పుకుంటాను అని చెప్పారు..ప్రభుత్వం పరంగా లేక పార్టీ పరంగా జరిగిన ఏ కార్యక్రమాల్లో జగన్ ఎప్పుడూ తన గురించి కనీసం ప్రస్తవించ లేదన్నారు..ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ పవన్ కళ్యాణ్ తన గురించి మాట్లాడుతూ ప్రశంసించారని తెలిపారు.. తనపై పవన్‌కళ్యాణ్ ఎంతో అభిమానంతో ఉన్నారని,,అలాంటి నాయకుడుతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు..తనతో పాటు కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కలిసి జనసేనలో చేరుతారని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు..