మహిళలే సమాజ నిర్మాణానికి నిజమైన వాస్తు శిల్పులు-పవన్ కళ్యాణ్
అమరావతి: కుటుంబాన్ని చక్కదిద్దడం నుంచి పరిపాలన, కార్యనిర్వహణ, వాణిజ్య వ్యాపారాలు, పరిశ్రమల నిర్వహణ వరకూ ప్రతి విభాగంలో మహిళామణులు తమ బాధ్యతను దిగ్విజయంగా పోషిస్తున్నారని డిప్యూటివ్ సీ.ఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు..సమాజ నిర్మాణానికి నిజమైన వాస్తు శిల్పి,, స్త్రీ మూర్తి అని పవన్ కల్యాణ్ వెల్లడించారు..రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేదుకు అవసరమైన అండదండలు అందిస్తుందన్నారు..వీరి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి 11.5 లక్షల మందికి దాదాపుగా రూ.4 వేల కోట్ల ప్రయోజనాలు కలిగించే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు..ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన,, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకాల ద్వారా అతివలు అధిక శాతం లబ్ధి పొందారని వెల్లడించారు.. స్త్రీ సంక్షేమం కోసం ఎప్పటికప్పుడు నూతన ఆలోచనలు చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌లకు ధన్యవాదాలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల మూలంగా మహిళలకు ఆర్థికపరమైన అంశాలపై అవగాహన మెరుగవుతోందన్నారు..అతివలు ఆర్థికంగా బలోపేతం అయితే కచ్చితంగా ప్రతి కుటుంబం తద్వారా సమాజం బహుముఖంగా సంపన్నం అవుతుందన్న పేర్కొన్నారు..సోషల్ మీడియాలో మహిళల గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా మాట్లాడే ప్రతి ఒక్కరిపైనా కఠినంగా చర్యలు వుంటాయని,,మహిళల రక్షణ, సంక్షేమం మా ప్రభుత్వ బాధ్యత’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.