మాజీ సీఐడీ ఛీఫ్ పీవీ సునీల్ కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు
15 రోజుల్లో వివరణ ఇవ్వండి..
అమరావతి: వైసీపీ ప్రభుత్వం హయంలో చక్రం తిప్పిన మాజీ సీఐడీ ఛీఫ్ IPS అధికారి పీవీ సునీల్ కుమార్‌పై ఛార్జెస్ ప్రేమ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది..ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ పోలిటికల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.. మాజీ సీఐడీ ఛీఫ్, అడిషన్ డీజీపీ, డీజీ సునీల్ కుమార్‌పై అఖిలభారత సర్వీసు నిబంధనలు 1969 ప్రకారం చార్జెస్ ప్రేమ్ చేస్తూ,, GO NO 1695ను ప్రభుత్వం విడుదల చేసింది.. IPS అధికారిగా ఉన్న పీవీ సునీల్ కుమార్ తన వివరణను లిఖిత పూర్వకంగా లేదా వ్యక్తిగతంగా 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది..సమాధానం ఇచ్చే క్రమంలో ఎలాంటి రాజకీయ ఒత్తడి తెచ్చినా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఉత్తర్వుల్లో వెల్లడించింది.. జూలై 12వ తేదిన సోషల్ మీడియా ద్వారా సునీల్ కుమార్ తనపై అభ్యంతరకర ఆరోపణల చేసినట్లు టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు నగరం పాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు..ఈ నేపధ్యంలో సునీల్‌కమార్ పై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అయన్ను బదిలీ చేసి వెయిటింగ్‌లో ఉంచింది..