చెవిరెడ్డి.మోహిత్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం సంఘటనలో 37వ నిందితుడైన చెవిరెడ్డి.మోహిత్‌రెడ్డిని బెంగుళూరులో పోలీసులు అదుపులో తీసుకున్నారు.. కౌటింగ్ కు ముందు స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించేందుకు పద్మావతి మహిళా వర్సిటీ వద్దకు వెళ్లిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై,,మోహిత్ రెడ్డి తన అనుచరులతో కలసి దాడి చేశాడు..చంద్రగిరి వైసీపీ అభ్యర్ది అయిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు అయిన మోహిత్‌రెడ్డి ఎన్నికలకు ముందు చంద్రగిరి పరిసరాల్లో భీభత్సం సృష్టించాడు. తనకు ఎదురే లేదన్నట్లు ప్రవర్తించాడు. అరెస్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించిన తిరుపతి పోలీసులు,,బెంగళూరు నుంచి తిరుపతికి తరలిస్తున్నారు.