11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షకు ఉపక్రమించిన పవన్ కళ్యాణ్
అమరావతి: గత వైసీపీ ప్రభుత్వ అవినీతి నిర్వాకం, హైందవ సంప్రదాయ వ్యతిరేక నిర్ణయాలతో, తిరుమల శ్రీవారి దేవస్థానం మహా ప్రసాదం లడ్డూ తయారీలో జంతు కొవ్వు, చేప నూనె కలిసిన కల్తీ నెయ్యి వినియోగించినట్లుగా వచ్చిన రిపోర్ట్ చూసి తీవ్ర దిగ్భ్రంతి చెందాను అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.శనివారం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ నేటి నుంచి 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షకు ఉపక్రమించారు..ఈ సందర్బంలో అయన మాట్లాడారు..కోట్లాది మంది కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీవారికి జరిగిన అపచారం సనాతన సంప్రదాయాలపై జరిగిన కుట్రగా భావిస్తున్నారు.. వైసీపీ ప్రభుత్వంలో రథాలను తగులబెట్టారని, ఆలయాలను అపవిత్రం చేశారని ఆరోపించారు.. ఏ మతమైనా సరే వారి మనోభావాలు దెబ్బకూడదని పవన్ కల్యాణ్ అన్నారు.. సంస్కరణల పేరుతో 2019 నుంచి వైసీపీ చాలా మార్పులు తీసుకొచ్చిందన్నారు.. తిరుమల శ్రీవారి పూజా విధానాలను సైతం మార్చేశారని విమర్శించారు.. శ్రీవాణి ట్రస్టు పేరుతో రూ.10వేలు వసూలు చేసి,,రశీదు మాత్రం రూ.500కే ఇచ్చారని మండిపడ్డారు.. మహాప్రసాదంగా భావించే శ్రీవారి లడ్డూలో కూడా ఈ స్థాయిలో కల్తీ జరుగుతుందని అస్సలు ఊహించలేదని తెలిపారు.. అపవిత్రం చేస్తే ఏం మాట్లాడకుండా ఉండాలా అని ప్రశ్నించారు.. ఇదంతా జరుగుతుంటే వైవీ సుబ్బారెడ్డి, ధర్మా రెడ్డి ఏం చేశారని నిలదీశారు..తప్పులు చేసిన వారిని జగన్ ఎలా సమర్థిస్తారని మండిపడ్డారు.. చర్చిలో, మసీదులో ఇలా జరిగితే జగన్ ఊరుకుంటారా అని ప్రశ్నించారు.. హిందూ ధర్మానికి జరిగితే ఎందుకు వెనకేసుకొస్తున్నారని నిలదీశారు..కోట్ల మంది హిందువులు స్వీకరించే ప్రసాదాన్ని అపవిత్రం చేస్తారా? అని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు..దోషులకు శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు.. వేదన కలిగినప్పుడు పోరాడతామని,, ఏ మతంపై దాడి జరిగినా ఇలాగే స్పందిస్తామని స్పష్టం చేశారు.. పరస్పర మత విశ్వాసాలను గౌరవించుకోవడం చాలా అవసరమని అన్నారు.