AP&TG

విశాఖలో 862 అడుగుల ఎత్తులో గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జిని ప్రారంభించిన ఎం.పీ భరత్

అమరావతి: సముద్ర మట్టానికి 862 అడుగుల ఎత్తులో 55 మీటర్ల పొడవుతో కైలాసగిరి కొండపై దేశంలోనే అత్యంత పొడవైన కాంటిలివర్ గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జిని ఎంపీ భరత్ సోమవారం అధికారికంగా ప్రారంభించారు..ఈ బ్రిడ్జి 500 టన్నుల భారాన్ని మోయగలదు. ఈ బ్రిడ్జిపైకి ఒకసారి కేవలం 40 మందిని మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఈ బ్రిడ్జిపై నుంచి బంగాళాఖాతం, తూర్పు కనుమలు, విశాఖ నగరం అందాలను చూడొచ్చు.

అద్భుతమైన సూర్యోదయ వీక్షణ:- పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో పీపీపీ పద్ధతిలో వీఎంఆర్‌డీఏ, ఆర్జే అడ్వెంచర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ బ్రిడ్జిని నిర్మించాయి. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రభుత్వం షుమారు 7 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. బ్రిడ్జి కోసం ఉపయోగించిన గ్లాస్‌ను జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు. హై క్వాలిటీ ట్రిపుల్ లేయర్, 40 mm టెంపర్డ్ లామినేషన్‌తో ఈ గ్లాస్ తయారు అయింది. గ్లాసు కింద బాగంలో 40 టన్నుల రీఇన్‌ఫోర్స్‌ డ్ స్టీల్ సపోర్టు అమర్చారు. పర్యాటకులు ఎలాంటి భయం లేకుండా బ్రిడ్జిపై నడవచ్చు. అద్భుతమైన సూర్యోదయం, సూర్యాస్తమ దృశ్యాలను ఈ గ్లాస్ బ్రిడ్జిపైనుంచి ఆస్వాదించ వచ్చు.

రూ.300 వరకు:- ఈ బ్రిడ్జి ప్రతి రోజు ఉదయం 9 గంల నుంచి రాత్రి 8 గంటల వరకు అనుమతి ఇస్తారు..10 నుంచి 15 నిమిషాల వరకు బ్రిడ్జిపై వుండేందుకు రూ.300 వరకు వసూలు చేయనున్నట్లు తెలుస్తొంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *