AP&TGNATIONAL

యూపి సీఎం యోగి ఆదిత్యనాథ్ తో మర్యాద పూర్వకంగా భేటి అయిన మంత్రి నారాయణ

అమరావతి: ఏపీలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కొరకు ఉపయోగిస్తున్న పద్ధతులను సీఎం యోగి ఆదిత్యనాథ్ కు మంత్రి నారాయణ, అధికారులు వివరించారు.. లక్నోలోని కాళిదాస్ మార్గ్ లో ఉన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో మంత్రి పొంగూరు నారాయణ భేటీ అయ్యారు..ఈ సందర్బంలో సీఎం చంద్రబాబు మంచి విజన్ ఉన్న నాయకుడని సీఎం యోగి వ్యాఖ్యనించారు.. మంగళవారం క్షేత్రస్థాయి ఘన వ్యర్థాల ప్లాంట్ల అధ్యయనం కోసం మంత్రి నారాయణ బృందం లక్నో పర్యటనకు వెళ్లారు..ఉత్తర ప్రదేశ్ లో ఘన వ్యర్థాల నిర్వహణ ను గురించి అధికారులు మంత్రి నారాయణ బృందంకు వివరించారు.ఏపీలో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించేందుకు రావాలని యూపీ అధికారులను మంత్రి నారాయణ ఆహ్వానించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *