ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత ప్రక్రియ ప్రారంభం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత ప్రక్రియ ప్రారంభం అయింది. విభజన చట్టం 5(2) సెక్షన్ సవరణకు కేంద్రం చర్యలు చేపట్టింది. సవరణకు ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదం తర్వాత బిల్లును పార్లమెంట్ ముందు ప్రవేశ పెడుతారు. పార్లమెంట్ ఆమోదం తరువాత ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ రాజపత్రం (గెజిట్) విడుదల చేస్తారు.

