హైందవ ధర్మాన్ని కించపర్చేలా తీసిన,,తీస్తున్న సినిమాలను బహిష్కరించాలి-అనంత శ్రీరామ్
హిందూ సమాజానికి,సినీ రంగం తరపున క్షమాపణలు..
అమరావతి: హైందవ ధర్మాన్ని కించపర్చేలా తీసిన,,తీస్తున్న సినిమాలను ప్రజలు,,ప్రభుత్వం వెంటనే బహిష్కరించాలని ప్రముఖ సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు..అదివారం విజయవాడ, గన్నవరం మండలం కేసరపల్లిలో జరుగుతున్న హైందవ శంఖారావానికి ప్రజలు,, వీహెచ్‌పీ కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు.. విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్‌కుమార్,, అయోధ్య రామ మందిరం ట్రస్టీ గోవింద్‌దేవ్ మహరాజ్,, వీహెచ్‌పీ కార్యనిర్వాహక కార్యదర్శి మిలింద్ పరందే,, జాయింట్ సెక్రటరీ కోటేశ్వరశర్మ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు..ఈ సందర్బంలో అనంత్ శ్రీరామ్ హైందవ ధర్మంపై జరుగుతున్నదాడుల పట్ల తీవ్రంగా స్పందిస్తూ హిందూ ధర్మాన్ని అవమానించేలా సినిమాలు తీయడంపై అనంత శ్రీరామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..
ఆలయాల ఆత్మగౌరవం కోసం లక్షల మంది తరలిరావడం మార్పుకు నాంది అన్నారు..సినిమా అనేది వ్యాపారాత్మకమైన కళ, కళాత్మకమైన వ్యాపారం అని అయితే ఈ రెండిటిని జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలుగుతుందని అన్నారు..జరిగే తప్పులను తాను బాహాటంగానే విమర్శిస్తున్నానని చెప్పారు..సినీమా రంగానికి చెందిన వాడిగా ఇప్పటివరకు సినిమాల్లో జరిగిన హైందవ ధర్మ వ్యక్తిత్వ హననం సమాజానికి తెలియచేస్తున్నాను అన్నారు..” హిందూ సమాజానికి …. తాను సినీ రంగం తరపున క్షమాపణలు చెబుతున్నానని అలా క్షమాపణ చెప్పకపోతే తను ఇలాంటి వేదికపై నుంచి మాట్లాడే అర్హత లేదన్నారు.. మన పురాణాలు, ఇతి హాసాల గొప్పతనాన్ని సినిమాల్లో తగ్గించి పలు పాత్రలు మార్చేస్తున్నారని మండిపడ్డారు.. చరిత్రను వక్రీకరించి హిందూ ధర్మాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.. వ్యాసుడు, వాల్మీకిల రచనలను వినోదం కోసం వక్రీకరించారని మండిపడ్డారు..గత కొన్ని సంవత్సరాల నుంచి నిన్న,, మొన్న వచ్చిన కల్కి చిత్రం వరకు కూడా కొన్ని పాత్రలను అవమానిస్తూనే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.. కర్ణుడి పాత్రకు అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి తాను సినిమా వాడిగా సిగ్గు పడుతున్నానని అన్నారు..
కృష్ణా జిల్లాకే చెందిన దర్శకలు,, నిర్మాతలే ఈ పొరబాటు చెప్పకపోతే ఎలా అని ప్రశ్నించారు..నిండు సభలో ద్రౌపదికి వస్త్రా భంగం జరుగుతున్న సమయంలో మౌనంగా ఉన్న కర్ణుడు ఎలా గొప్పవాడు? దిన్ని హిందు సమాజం ఒప్పుకుంటుందా? కల్కి సినిమాలో అగ్నిదేవుడు ద్వారా వచ్చిన అర్జునుడు కంటే… సూర్యుడు ద్వారా వచ్చిన కర్ణుడు గొప్ప అంటే హిందూ ధర్మం అంగీకరిస్తుందా ? భారతంలోనే కాదు రామాయణం, భాగవతంలోనూ ఇష్టానుసారంగా పురాణాలను మార్చివేశారు? అభూత కల్పనలు వక్రీకరణలు చేస్తున్నా మనం చూస్తూ ఊరుకుంటున్నాం అంటూ అవేదన వ్యక్తం చేశారు..సినిమాల చిత్రీకరణలో,,పాటల్లో ఎన్నో రకాల అవమానాలు జరిగాయని,,దమ్మారో దమ్ అంటూ హరే రామ హరే కృష్ణ అంటారా..?? ఇస్కాన్ వారి నినాదాన్ని సిగరేట్ తాగుతూ అవమానిస్తారా..?? ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకుందామా, సహిద్దామా, భరిద్దామా..?? అంటూ ప్రశ్నించాడు.. రాముడు, కృష్ణుడు గొప్పతనం చెబుతూ సిరివెన్నెల రాసిన పాటలను ఆదర్శంగా తీసుకోండి.. దైవమూర్తులు, స్వామీజీలను అనుకరించి వారిని అవమానపరిచేలా అవహేళన చేసేలా పాత్రలు చిత్రీకరిస్తున్నారని విమర్శించారు.. ఒక దర్శకుడు బ్రహ్మాండ నాయకుడి అనే పదం ఉండకూడదని చెబితే నేను 15 ఏళ్లుగా ఆ వ్యక్తికి పాటలు రాయలేదని తెలిపారు.. తిరుపతి ఆలయాన్ని విమర్శిస్తూ ఉంటే నిర్మాతలు ఎందుకు ఎదురు చెప్పడం లేదు… హిందువులే పూర్తిగా ఇలాంటి సినిమాలను బహిష్కరించాల్సిన సమయం వచ్చిందన్నారు.. అప్పుడే మన ధర్మానికి ఒక గౌరవం, గుర్తింపు ఉంటాయన్నారు..
ఈ సభకు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి హాజరయ్యారు.. వీరితో పాటు రాష్ట్రంలోని 150 మంది స్వామీజీలు ఈ శంఖారావంలో పాల్గొన్నారు..కార్యక్రమానికి హాజరు అయిన వారికి వీహెచ్‌పీ పెద్దలు, సభ నిర్వాహకులు స్వాగతం పలికారు.. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి వచ్చే వరకు పోరాడతామన్నారు వీహెచ్‌పీ నేత గోకరాజు గంగరాజు. దేవాలయాల రక్షణకు ఎంతో మంది బలిదానాలు చేశారని.. దేవాలయాలు దోపిడీకి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.. సెక్యులరిజం పేరుతో ఆలయాలను ప్రభుత్వాల గుప్పిట్లో పెట్టకున్నాయని ఆరోపించారు.. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేశారు.. బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. దేవాలయాలపై దాడులు పెరిగాయన్నారు.. ఆలయాల్లో అన్యమతస్తులు పెరిగారని,, హిందూ ధర్మం, సంప్రదాయాలను కాపాడాలని,, దేవాలయాలకు రక్షణ కల్పించాలన్నారు.. హైందర శంఖారావం వేదికగా హిందూ ధర్మ పరిరక్షణకు అంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని స్వామిజీలు, ప్రముఖులు పిలుపునిచ్చారు. హిందువులపై జరిగే దాడులను ఖండించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.