పిల్లలను బాగా చదివించండి-వాళ్లకు మీరు అందించే ఆస్తి చదువే-సీ.ఎం చంద్రబాబు
అమరావతి: మెగా పేరెంట్స్ ,టీచర్స్ ఆత్మీయ సమావేశం 3 .0లో బాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లు మన్యం పార్వతిపురం జిల్లాలోని భామినిలోని ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణాన్ని సందర్శించారు.శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో విద్యార్ధుల అందుబాటులో వున్న పాఠశాలలోని మౌలిక సదుపాయాలు, క్రీడా ప్రాంగణం గురించి అడిగి తెలుసుకున్నారు.

వివిధ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులను ఉత్సాహపరిచారు.పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, పేరెంట్స్ ఏం చదువుకున్నారని అడిగి తెలుసుకున్నారు. పిల్లలను బాగా చదివించండి… వాళ్లకు మీరు అందించే ఆస్తి చదువేనని అని అన్నారు. మధ్యాహ్న భోజనం రుచికరంగా ఉందా..? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ లో విద్యార్థినుల ప్రజెంటేషన్ ఇవ్వగా,, స్టెమ్ ల్యాబ్ పరిశీలించారు.ల్యాబ్ లో విద్యార్థినుల ప్రజెంటేషన్ ఇచ్చిన తీరును అభినందించారు. క్లాస్ రూంలో కూర్చొని క్లికర్ విధానాన్ని విద్యార్థులతో కలిసి పరిశీలించారు.

