D.హరితకు కన్ఫర్డ్ IAS క్యాన్సిల్
ఎంత ఉఫ్పు తింటే అంత దాహం తప్పదు కదా మరి ?
నెల్లూరు: నెల్లూరులో RDOగా కొంత కాలం తరువాత నెల్లూరు నగరపాలక సంస్థ కమీషనర్ పనిచేసిన D.హరిత 2018లో కన్ఫర్డ్ IAS గా పదొన్నతి పొందింది..అమె విధులు నిర్వహించిన ప్రతి చోట వీపరితమైన అవినితి జరిగిందని రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి ఆనం.వెంకటరమణరెడ్డి పేర్కొన్నారు..అమె తిరుపతిలో కమీషనర్ గా పనిచేస్తున్న సమయంలో తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో TDR bonds లో అంతులేని అవినితికి పాల్పపడినట్లు స్పష్టమైందన్నారు..ఈమె అవినితి పరాకాష్టకు చేరుకొవడంతో ప్రస్తుతం అనంతపురం జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న హరిత కన్ఫర్డ్ IASను తత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జనరల్ అడ్మిన్ స్ట్రేట్ డిపార్ట్ మెంట్ ఉత్తర్వులు జారీ చేస్తూ,అమె వెంటనే అమరావతిలో రిపొర్ట్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అదేశాలు జారీ చేశారు.. TDR bonds కుంభకోణంలో వేల కోట్ల అవినితిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది..ఈ విషయంపై చాలా లోతుగా దర్యప్తు జరుగుతున్నట్లు సమాచారం.