AP&TG

రాజధానిలో భారీ స్థాయిలో ESI హాస్పిటల్,మెడికల్ కాలేజీ నిర్మాణాలు-మంత్రి నారాయణ

జనవరి మొదటి వారం..

అమరావతి: 2019 కి ముందు 131 సంస్థలకు భూములు కేటాయించగా…వాటిలో కొన్ని మాత్రమే తమ కార్యాలయాలు ఏర్పాటు ప్రారంభించాయని,,భూములు కేటాయించిన ఇతర సంస్థల నుంచి రాతపూర్వకంగా వివరాలు కోరుతున్నట్లు మునిసిపాల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు..రాజధానిలో సంస్థలకు భూ కేటాయింపులపై వేసిన కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం సచివాలయంలో సమావేశమైంది..తాజాగా అమరావతిలో భారీ స్థాయిలో ఈఎస్ఐ ఆసుపత్రి,మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 20 ఎకరాల స్థలం కేటాయింపునకు ఈరోజు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు…అలాగే గత ప్రభుత్వంలో భూములు పొందిన సంస్థలకు పూర్తి అంగీకారం తెలుపుతూ మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుందన్నారు..

ఆయా సంస్థల వివరాలు:- సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్ కు(CITD)5 ఎకరాలు..ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(IGNOU)కి 0.8 ఎకరాలు..బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు 15 ఎకరాలు.. లార్సన్ అండ్ టర్బో స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి 5 ఎకరాలు.. బ్రహ్మకుమారి ఎడ్యుకేషన్ సొసైటీ కి 10 ఎకరాలు కేటాయించామని,, టీటీడీకి గతంలో కేటాయించిన 25 ఎకరాలకు పూర్తి అంగీకారం తెలపడం జరిగిందన్నారు.. గతంలో ఇచ్చిన వారికి అప్పటి ధరలకే భూములు ఇస్తున్నామన్నారు..దీంతో పాటు ఆయా సంస్థలకు ఇతర రాష్ట్రాల్లో ఎంత భూమి కేటాయించారు..ప్రస్తుతం ఎంత అవసరం అనేదానిపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు.కొత్తగా భూ కేటాయింపులు చేసే సంస్థలకు ధరల అంశంలో ఒక పాలసీ తయారు చేస్తామన్నారు.అన్నీ సంస్థలకు వచ్చే నెలాఖరులోగా భూకేటాయింపులు పూర్తవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు..

జనవరి నుంచి రాజధాని నిర్మాణ పనులు:- జనవరి నుంచీ రాజధానిలో నిర్మాణ పనులు మొదలవుతాయన్నారు.. డిసెంబరు నెలాఖరుకల్లా 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, మిగతా టవర్ల నిర్మాణాలుకు టెండర్లు పూర్తవుతాయన్నారు.. గతంలో పనులు నిలిచిపోయిన వాటికి సంబంధించి టెండర్ ల ఒప్పందాలు రెండు మూడు రోజుల్లో రద్దు చేస్తామన్నారు..ఆ వెంటనే కొత్తగా టెండర్లు పిలుస్తామని తెలిపారు.ఈ సమావేశంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *