మాజీ మంత్రి విడదల రజినిపై పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు
అమరావతి: వైసీపీ ప్రభుత్వం అధికారంలో వున్న గత 5 సంవత్సరాల్లో సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక, మార్ఫింగ్ పోస్టులు పెట్టామని తమపై తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టించి,హింసించారని మాజీ మంత్రి విడదల రజినిపై చిలకలూరిపేట ఐటీడీపీ నాయకుడు పిల్లి కోటేశ్వరరావు, పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు.. మాజీ మంత్రితో పాటు ఆమె వ్యక్తిగత సహాయకులు రామకృష్ణ,,జయ ఫణీంద్ర కుమార్,, గతంలో చిలకలూరిపేట అర్బన్ సీఐగా విధులు నిర్వహించిన సూర్యనారాయణలు అక్రమ కేసులతో వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు..పోలీసు స్టేషన్‌లో తమను అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారని,,తము బాధతో కేకలు వేస్తుంటే వాట్సప్ కాల్‌లో మాజీ మంత్రి విడదల రజిని,,ఆమె వ్యక్తిగత సహాయకులకు చూపిస్తూ మరింతంగా చితకబాదరని ఆరోపించారు..విచారణ జరిపి కేసు నమోదు చేయాలని ఎస్పీ శ్రీనివాసరావుని బాధితులు కోరారు.