తల్లిదండ్రుల తరువాత విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయులే-ఉప ముఖ్యమంత్రి
అమరావతి: పిల్లలు ఎక్కువ సమయం ఉపాధ్యాయుల దగ్గరే ఉంటారు కాబట్టి ఉపాధ్యాయులు విద్యార్దులకు దైవసమానులు అవుతారని,, తల్లిదండ్రుల తరువాత విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయులకు అంత గొప్ప స్థానం ఉంటుందని,,అందుకు ఈ పేరెంట్- టీచర్స్ మీటింగ్ అద్భుతంగా దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.

శుక్రవారం చిలకలూరిపేట శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సైన్స్ , ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ తోపాటు పాఠశాలలోని తరగతి గదులను, లైబ్రరీని పరిశీలించారు. ఇటీవల పిఠాపురం స్కూల్లో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవని కొందరి రాజకీయ లబ్దికోసం కుల గొడవలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని,,ఇలాంటి వారి విషయంలో తల్లిదండ్రుల జాగ్రత్త వుండాల్సి అవసరం వుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

