Recent Posts

ఏ.పీలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేసిన ఏపీపీఎస్సీ

అమరావతి: నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ,పరీక్షల కోసం ఎంతోకాలంగా ప్రిపేర్‌ అవుతున్నవారికి..(ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) ఏపీపీఎస్సీ శుభవార్త చెబుతూ,, రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులతో పాటు.. దేవదాయశాఖలో గ్రేడ్‌-3 ఈవో పోస్టుల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్లు జారీ చేసింది..రెవెన్యూ శాఖలో 670 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి,,దేవదాయ శాఖలో 60 గ్రేడ్‌-3 ఈవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.. జిల్లాల వారీగా రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల వివరాలు ఇలా వున్నాయి..శ్రీకాకుళం-38, విజయనగరం-34, విశాఖ-43, తూర్పు గోదావరి-64, పశ్చిమ గోదావరి-48, కృష్ణా జిల్లా-50, గుంటూరు-57, ప్రకాశం జిల్లా-56, నెల్లూరు-46, చిత్తూరు-66, అనంతపురం-63, కర్నూలు-54, కడప-51గా ఉన్నాయి.. దేవదాయ శాఖలోని ఈవో గ్రేడ్‌-3 పోస్టుల వివరాలు… శ్రీకాకుళం-4, విజయనగరం-4, విశాఖపట్నం-4, తూర్పుగోదావరి-8, పశ్చిమ గోదావరి -7, కృష్ణా జిల్లా -6, గుంటూరు-7, ప్రకాశం జిల్లా-6, నెల్లూరు-4, చిత్తూరు జిల్లా-1, అనంతపురం-2, కర్నూలు-6, కడప-1గా ఉన్నాయి.. రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో పోస్టుల భర్తీకి ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 18వ తేదీ అర్థరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ప్రకటనలో పేర్కొంది..

Spread the love
error: Content is protected !!