Recent Posts

బీసీసీఐలోని అవినితి నిరోధక విభాగంకు కొత్త అధికారి నియామకం

అమరావతి: బీసీసీఐలోని అవినితి నిరోధక విభాగంకు కొత్త అధికారిని నియమించారు..ఏప్రిల్ 9వ తేది నుంచి IPL-14వ సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో BCCI గుజరాత్ మాజీ డీజీపీ పనిచేసి 2010 లో రిటైర్డ్ అయిన షాబిర్ హుస్సేన్ షెఖదమ్‌ ఖాండావాలాను కొత్త ACU చీఫ్‌గా నియమించింది..BCCIలో ఇప్పటివరకూ ACU చీఫ్‌గా వ్యవహరించిన అజిత్ సింగ్ షెకావత్ పదవీకాలం మార్చి 31న ముగిసింది. 2018 ఏప్రిల్ 30‌ నుంచి 2021 మార్చి 31 వరకూ అజిత్‌ సింగ్‌ షెకావత్‌ BCCI ACU చీఫ్‌గా సేవలందించారు..IPLలో బెట్టింగ్ మాఫియా పెరిగిపోతుండటంతో బుకీలపై నిఘా తప్పనిసరి చేశారు..అందుకే పాత చీఫ్ పదవీకాలం ముగిసిన వెంటనే కొత్త నియామకం చేసినట్లు BCCI అధికారి ఒకరు తెలిపారు..IPL ప్రారంభ మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుండటంతో షాబిర్ హుస్సేన్ రెండు రోజుల్లో అక్కడకు ప్రయాణం కానున్నారు..ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆటగాళ్లందరికీ అవగాహనా కార్యక్రమాలు చేపట్టనున్నారని,,BCCI వర్గాలు వెల్లడించాయి..

Spread the love