Recent Posts

ఇక నుంచి త్యాగాలను గమనించడానికి ఏపీ బీజేపీ శాఖ సిద్ధంగా లేదు-సోము

అమరావతి: ఈ మధ్య కొంతమంది త్యాగానికి సిద్దంగా ఉన్నామని మట్లాడుతున్నారని,,ఇప్పటి వరకు చాలా సందర్భాలలో ఆ త్యాగం గమనించామని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు వ్యంగ్యంగా వ్యాఖ్యనించారు.. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ,,టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన పొత్తుల వ్యాఖ్యలపై పై విధంగా స్పందిచారు..ఇకపై గమనించడానికి ఏపీ బీజేపీ శాఖ సిద్ధంగా లేదని ఈ మీడియా వేదికగా స్పష్టంగా చెబుతున్నా అని అన్నారు.. అభివృద్ది, సంక్షేమం మన దగ్గర ఉందని,,ఈ కుటుంబ పార్టీలకోసం మనం త్యాగం చేయాల్సిన అవసరం లేదని,,అలాంటి త్యాగధనులంతా తెలుసుకొవాలన్నారు.. మేము, అవినీతి రాజకీయాలకు,, కుటుంబ పార్టీలకు వ్యతిరేకమన్నారు..2024లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు..సోము.వీర్రాజు వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి మరి ??

Spread the love
error: Content is protected !!