Recent Posts

అంజనాద్రి పర్వతంపైనే ఆంజినీ పుత్రుడి జన్మించాడు-ప్రొఫెసర్ మురళీధర శర్మ

తిరుపతి: హిందువుల ఆరాధ్యదైవం ఆంజినీ పుత్రుడి జన్మస్థలంపై దశాబ్దలుగా కొనసాగుతూ వస్తోన్న వివాదాలకు తిరుమల తిరుపతి దేవస్థానం ముగింపు పలికింది..హనుమంతుడు,, అంజనాద్రి పర్వతంపైనే జన్మించినట్లు ప్రకటిస్తు,,ఈ విషయాన్ని శాస్త్రీయబద్ధంగా నిరూపించింది.. ఇన్నాళ్లూ కర్ణాటకలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రాచీన,,పర్యాటక కేంద్రం హంపి సమీపంలోని కిష్కింధ వద్ద గల ఆంజనేయ బెట్టను హనుమంతుడి జన్మస్థలంగా భక్తులు భావిస్తూ వచ్చారు.. ఈ క్షేత్రంను ఇంత వరకు ఎవరూ శాస్త్రీయంగా నిర్ధారించలేకపోయారు.. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని దీనిపై ఓ స్పష్టమైన ప్రకటన చేస్తామని టీటీడీ అధికారులు ఇటీవలే ప్రకటించారు..అంజనాద్రి పర్వతమే ఆంజనేయుడి జన్మస్థలమని స్పష్టం చేశారు..ఆంజనేయుడి తల్లి అంజన పేరు మీదే వెలసివున్న,అంజనాద్రి,,సాక్షాత్ శ్రీమహావిష్ణువు కొలువై ఉన్నాడని భావించే తిరుమలగిరుల్లోని ఓ పర్వతం..తిరుమల శ్రీవారి ప్రధాన ఆలయం ఆనంద నిలయానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆకాశగంగ సమీపంలో అంజనాద్రి పర్వతం కొలువై వున్నది.. తిరుమల ఏడుకొండలను వృషభాద్రి,, వృషాద్రి, అంజనాద్రి,,గరుడాద్రి,,శేషాద్రి,,వేంకటాద్రి,,నారాయణాద్రిగా పిలుస్తారు..ఇందులో ఒకటైన అంజనాద్రి పర్వతమే ఆంజనేయుడి జన్మస్థలమని టీటీడీ ప్రకటించింది..బుధవారం తిరుమలలోని నాదనీరాజనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీధర శర్మ ప్రకటించారు.. హనుమంతుడి జన్మస్థానం ఏదనే విషయంపై అన్వేషణ సాగించడానికి టీటీడీ ఇదివరకే ఓ కమిటీని నియమించింది..క‌మిటీకి మురళీధర శర్మ నేతృత్వం వహించారు..ఇందులో శ్రీవేంకటేశ్వర వేద విశ్వ‌విద్యాల‌యం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ స‌న్నిధానం సుదర్శ‌న‌ శ‌ర్మ‌,,స‌దాశివ‌మూర్తి,,జాన‌మ‌ద్ది రామ‌కృష్ణ‌,,శంక‌ర‌నారాయ‌ణ‌,, ఇస్రో శాస్త్రవేత్త రేమెళ్ల మూర్తి,,రాష్ట్ర పురావ‌స్తు శాఖ డిప్యూటీ డైరెక్ట‌ర్ విజ‌య్‌కుమార్ స‌భ్యులుగా ఉన్నారు..ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ క‌న్వీన‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు..హనుమంతుడి జన్మస్థలంపై ఈ కమిటీ నాలుగు నెలల పాటు వారి అన్వేషణ సాగించి,,శాస్త్రీయ ఆధారాలను సేకరించింది..హ‌నుమంతుడు అంజ‌నాద్రిలోనే జ‌న్మించాడ‌ని రుజువు చేయడానికి అవసరమైన ఆధారాలను సేక‌రించి,, శ్రీరామ నవమి పండుగ సందర్భంగా వాటిని వెల్లడించింది..హనుమంతుడు అంజనాద్రి పర్వతంపైనే జన్మించాడనటానికి సమగ్ర అన్వేషణ సాగించామని,, ప్రాచీణ గ్రంధాలను అధ్యయనం చేశామని,,శాస్త్రీయ బద్ధమైన ఆధారాలను సేకరించామని మురళీధర శర్మ తెలిపారు..జాపాలి మహర్షి తపస్సు చేసింది కూడా అక్కడేనని, అందుకే ఆ ప్రదేశాన్ని జాపాలితీర్థం అంటారని పేర్కొన్నారు.

Spread the love