Recent Posts

ఆనందయ్య కరోనా మందు పంపిణీ “చరిత్రగా మారిపోయింది”-సోమిరెడ్డి

అమరావతి: కృష్ణపట్నంలో ఆనందయ్య పంపిణీ చేసిన ఆయుర్వేదం మందు చారిత్రాత్మక ఘటనగా మారిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు..ఆనందయ్య మందును అమ్ముకోవాలని కుట్రలు మొదలైనాయన్నారు.. childeal.com వెబ్ సైట్ ను godaddy నుంచి శ్రేశిత టెక్మాలజీ వారు కొన్నారని,,శ్రేశిత టెక్మాలజీ డైరెక్టర్లు వైసీపీ వారే అన్నారు..మూడు మందులను ఒక్కోక్క రేటు చొప్పున అమ్మాలని childeal.com లో పెట్టారని అన్నారు..మందులను 167 రూపాయలకు అమ్మాలని ఆన్ లైన్ లో పెట్టగా,మందు అమ్మకాన్ని ఆనందయ్య ఒప్పుకోలేదన్నవిషయం ఆనందయ్య కుమారుడు స్వయంగా చెప్పాడని తెలిపారు..ఈ నకీలి వెబ్ సెట్ ను నమ్మోదని,,ఓ కుటుంబం తయారు చేసిన మందు కాకాణి ఎలా అమ్ముతాడని ప్రశ్నించారు..మందు అమ్మి సోమ్ము చేసుకోవాలని కాకాణి గోవర్థన్ రెడ్డి కుట్రలు పన్నుతున్నాడని ఆరోపించారు..నకీలీ వెబ్ సైట్లు సృష్టించి అమ్మాలని ప్రయత్నించిన వారిపైన రేపు సైబర్ క్రైం కు ఫిర్యాదు చేస్తానని,,ఆనందయ్యను ఎందుకు నిర్భందించారో మాకు చెప్పాలి అని డిమాండ్ చేశారు..ఇంకా ఆనందయ్యకి స్వేచ్ఛ రాలేదని తెలిపారు. తెలంగాణ నుండి సన్మానించడానికి యాదవ సంగం వాళ్ళు వస్తే పోలీసులతో తరిమిచ్చారని మండిపడ్డారు. ఆనందయ్య మందు పంపిణీకి పర్మిషన్ ఇవ్వమని కోర్టుకి వెళ్తే ప్రభుత్వ లాయర్ అడ్డుకున్నారన్నారు..కోటి మందికి ఆన్‌లైన్‌లో మందు అమ్మి రూ.120 కోట్లు సొమ్ము చేసుకునేందుకు కాకాణి ప్రయత్నం చేశారని ఆరోపించారు..నకిలీ సైట్ క్రియేట్ చేసిన వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆనందయ్య మందుకు ఫ్యాను గుర్తు పెట్టడం ముఖ్యమంత్రిని దిగజార్చడమే అని వ్యాఖ్యానించారు..ఎమ్మెల్యే చేస్తున్న ఆగడాలను నిలదీసే దమ్ము, ధైర్యం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఎస్పీ, కలెక్టర్‌లకు లేదన్నారు..సుమోటోగా కుట్రపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే.. తాము మోమోరాండం ఇవ్వడానికి సిద్ధమని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Spread the love